ap news

ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది..

రైతుల బాధలు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి పట్టవా

ధాన్యం కొనుగోలులో ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ నాయకుల చెంచాలు, బ్రోకర్లదే రాజ్యం

రైతుల కళ్లలో కళ్లు పెట్టి నేరుగా వెళ్లి పలకరించే దమ్ము, ధైర్యం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉందా..

వెంకటాచలం మండలం ఇడిమేపల్లి పంచాయతీలోని రైతులను శుక్రవారం సాయంత్రం నేరుగా వెళ్లి కలిసి పలకరించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ సందర్భంగా రైతులు తమ కష్టనష్టాలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర చెప్పుకుని తమ గోడును వినిపించారు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడం, ఇదే అదునుగా భావించి బ్రోకర్లు కారుచౌకగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ గోడును కనీసం పట్టించుకోవడం లేదని, రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అక్కడ కనీసం సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఉండటం లేదని, తాము పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు చేయడం లేదని రైతులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వద్ద చెప్పుకుంటూ ఆవేదన చెందారు.

సోమిరెడ్డి ఏమన్నారంటే..

కల్లాల్లో ధాన్యం రైతులతో మాట్లాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

జిల్లా చరిత్రలో తొలిసారిగా వేలాది మంది రైతులతో పంచలు కట్టి నడుం బిగించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాం.
అయినా వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరవలేదు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా చేసిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదేదాదాపు రైతులందరూ గిట్టుబాటు ధర లేక పండించిన వరి ధాన్యాన్ని కారుచౌకగా అమ్ముకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారు… ఇది వాస్తవం కాదా..ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదో తాను ఉద్ధరించినట్లుగా ఊరేగింపులు, డప్పులు వాయించుకుంటూ తిరుగుతున్నాడు.. ఇది కాకాని గోవర్ధన్ రెడ్డికే చెల్లింది..విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వంపై ఉమేస్తుంటే వారు కూర్చుని ఎమ్మెల్యే ఏదో ఉద్దరించాడని పొగడుతుండటం విడ్డూరంగా ఉంది..రైతుల కడుపు మండిపోతుంటే పట్టించుకునే నాధుడే లేడు..రైతు భరోసా కేంద్రాలు చూపుడుకే.. ఈ మాట నా మాట కాదు రైతుల మాట.. గ్రామాలలో రైతులు చెబుతున్న మాట..రైతు భరోసా కేంద్రాల్లో వాటిలో పనిచేస్తున్న సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండక పోవడం దురదృష్టకరం

వేయి కోట్ల నష్టం..

ఈ ఒక్క పంటకు 25 లక్షల పుట్లకు గాను రైతులు రూ.వెయ్యి కోట్ల రూపాయల వరకు నష్టపోయారు.. ఇంత అన్యాయమా..నేరుగా రైతులకు పుట్టికి రూ.16,660 చొప్పున చెల్లించరా.. కారుచౌకగా అధికార పార్టీ నాయకులు, వారి చెంచాలు, బ్రోకర్లు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచారు..రైతులకు ఒక పుట్టికి రూ.20 వేలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుంది.. టెండర్ జీతం కన్నా తక్కువ ఇస్తే రైతు ఎలా బతుకుతారు..సీఎం నుండి ఎమ్మెల్యేల వరకు ప్రతి గింజను కొంటామని మాటలతో ఊదరగొట్టారు..రైతుల దగ్గర ధాన్యాన్ని రూ. 12 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ  కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, తిరుపతి పార్లమెంటరీ తెలుగు రైతు విభాగం అధ్యక్షులు రావూరి రాధాకృష్ణమ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు రైతు విభాగం నాయకులు ఏల్లూరు కృష్ణారెడ్డి, టీడీపీ మండల ఉపాధ్యక్షులు చల్లా నాగార్జున రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పఠాన్ ఖాయ్యుమ్ ఖాన్, సీనియర్ నాయకులు పెనుమల్లి హరిరెడ్డి, నిక్కుదల రమేష్, పాలెపు మణి, మల్లి శ్రీనివాసులు, చెత్తమ్మ, గుమ్మా రాజగోపాల్,గుమ్మా దిలీప్, బెల్లంకొండ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *