కీరదోస..ఉపయోగాలెన్నో..!

ఎండ‌లు మండిపోతున్నాయి. అడుగు బ‌య‌ట పెట్టాలంటేనే జ‌నాలు భ‌య‌ప‌డుతున్నారు. ఇక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వెళ్లేవారు వేస‌వి తాపం నుంచి త‌మ‌ను తాము కాపాడుకునేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు.

వాటిల్లో కీర‌దోస కూడా ఒక‌టి. నిజానికి ఇది మ‌న‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ల‌భిస్తుంది. కానీ వేస‌విలో వీటి వినియోగం ఎక్కువ‌. ఎందుకంటే కీర‌దోస వ‌ల్ల మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. అనేక పోష‌కాలు ఉండ‌డం వ‌ల్ల శ‌రీరం అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటుంది. ఈ క్రమంలో కీర‌దోస వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కీరదోస‌లో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాఫీలు, టీలు తాగే బదులు కీరదోస‌ ముక్కలు అప్పుడప్పుడు రోజూ తింటుంటే వేసవిలో జీర్ణ సమస్యలు తలెత్తవు. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం క‌లుగుతుంది. కీరదోస చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా కళ్లకింద నల్లచారలు రాకుండా కాపాడుతుంది. కీరదోస‌కాయ‌ల‌ను అడ్డంగా ముక్క‌లుగా కోసి వాటిని కళ్లమీద పెట్టుకుంటే వాటి కింద ఉండే న‌ల్ల‌ని వ‌ల‌యాలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.

90 శాతం నీరు

కీరదోస‌లో 95 శాతం నీరు ఉంటుంది. కాబట్టి తరచూ దీన్ని తినడం వ‌ల్ల శరీరం డీహైడ్రేడ్ అవ్వదు. అలాగే వ్యర్ధాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. చర్మానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది. అందువ‌ల్ల సూర్య‌ర‌శ్మి నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల నుంచి మ‌న‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

మెుండి వ్యాధి క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసే గుణాలు కీరదోస‌లో ఉన్నాయి. రోజూ ఒకటి చొప్పున కీర‌దోస‌ను తింటే క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు.

రోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని కీరదోస‌ ముక్కలు తింటే ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు వచ్చే తలనొప్పి ఉండదు. హ్యాంగోవర్ తగ్గుతుంది.

బరువు తగ్గడానికి కూడా కీరదోస‌ ఎంతో ఉపకరిస్తుంది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా కొన్ని తాజా కీర ముక్కల్ని తింటుంటే అధిక బరువు త‌గ్గుతారు. దీంతోపాటు శరీరంలోని మలినాలు కూడా తొలగిపోతాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *