77 శాతం వాటా..16 బిలియన్ డాలర్లు

77 శాతం వాటా..16 బిలియన్ డాలర్లు..ఇదీ వాల్ మార్ట్-ఫ్లిప్ కార్డ్ డీల్..దీంతో అత్యంత గరిష్ట వాటా ఫ్లిఫ్ కార్ట్ ను వాల్ మార్ట్ తన వశం చేసుకుంది. ఫ్లిఫ్ కార్ట్ లో భాగస్వామిగా ఉన్న ఉన్న సాఫ్ట్ బ్యాంక్ కూడా 20 శాతం వాటాను వాల్ మార్ట్ కు అమ్మేసింది. తాను కొనుగోలు చేసిన వాటాలతో పాటు మరో రెండు మిలియన్ డాలర్లు (13 వేల కోట్ల రూపాయలు)ను వాల్ మార్ట్ అదనంగా ఫ్లిప్ కార్ట్ పై పెట్టుబడి పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ మార్కెట్ ను ఉరకలెత్తించటమే లక్ష్యంగా ఫ్లిఫ్ కార్ట్ ను కొనుగోలు చేశామనీ, తమకు భారత్ అకర్షణీయమైన మార్కెట్ అని వాల్ మార్ట్ సీఈవో డౌగ్ మెక్ మిల్లన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ కూడా ఫ్లిఫ్  కార్ట్ లో వాటా కొనుగోలు చేయటం విశేషం. సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ అనే అమెజాన్ మాజీ ఉద్యోగులు 2007లో ఫ్లిప్ కార్ట్ స్థాపించారు. సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి తప్పుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *