సరిహద్దులో ఉద్రిక్తత..ప్రతిఘటించిన సైన్యం

జమ్ము కాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలోని సరిహద్దుల్లో భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్‌ సైనిక దళాలు కాల్పులు చేసిన ఘటనలో శుక్రవారం ఉదయం ఓ యువకుడు మరణించారని పోలీసులు తెలిపారు.గురువారం అర్ధరాత్రి జిల్లాలోని గుల్పూర్‌ – బాగ్‌హల్‌ ధరా బెల్డ్‌ సరిహద్దుల వద్ద ఉన్న భారత సైనిక స్థావరాలపై చిన్న ఆయుధాలను ఉపయోగించి పాకిస్తాన్‌ సైన్యం కాల్పులకు పాల్పడిందని పోలీసు అధికారులు తెలిపారు.కాగా, భారతసైన్యం ప్రతిఘటించిందని తెలిపారు.మరణించిన యువకుడు కల్షాన్‌ మల్టి బాగ్‌హల్‌ థరా ప్రాంతానికి చెందిన మహ్మమద్‌ ఇఖ్లాక్‌గా గుర్తించామని తెలిపారు.కాల్పుల సమయంలో యువకుడు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా తలకు బుల్లెట్‌ తగిలిందని, దీంతో అక్కడిక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *