ఎర్రచందనం స్వాధీనం

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రిజర్వు ఎస్సై వాసు ఆధ్వర్యంలో శ్రీవారి మెట్టు అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా గతంలో ఎన్ కౌంటర్ జరిగిన సచ్చినోడుబండ దగ్గర ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు.అయితే… వారిని లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా వినకుండా పోలీసులపైకి రాళ్లురువ్వారు. ఈ సందర్బంగా వారిని చెదరగొట్టిన పోలీసులు 7ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న అనంతరం తొండవాడ బ్రిడ్జి వైపు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం దుంగలను తరలించేందుకు కూలీలు సిద్ధంగా ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. కాగా… పోలీసులను చూసిన కూలీలు జాతీయ రహదారి వైపు పారిపోయారు. ఇక్కడ 16 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *