సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు

తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని, మహిళా సంఘాలతో కలిసి నటి శ్రీరెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ త్రిపురణ వెంకటరత్నానికి ఫిర్యాదు చేశారు.మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌తో కలిసి మూడు గంటల పాటు మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులపై చర్చించారు.అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సినీ పరిశ్రమలోని పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరిస్తామని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ హామీ ఇచ్చారని శ్రీరెడ్డి తెలిపారు.త్వరలో దిల్లీ వెళ్లి జాతీయ మహిళా కమిషన్‌ను కూడా కలిసి ఈ విషయంపై పిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కుటుంబాల ఆధిపత్యం ఉందని, దాని వల్ల ఏ సమస్యలు ప్రస్తావించినా పరిష్కారం దొరకటం లేదని మహిళా నాయకురాలు సంధ్య ఆరోపించారు.మహిళా ఆర్టిస్టులకు ఉపాధి, భద్రత కల్పించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *