చిన్నారులపై అత్యాచారాలకు నిరసన

మదర్స్ డే సందర్భంగా
క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన రంగుల ఆర్ట్స్ గ్యాలరీ

మదర్స్ డే సందర్భంగా రంగుల ఆర్ట్స్ గ్యాలరీ ఒంగోలులోని గాంధీ పార్కులో చిన్నారులపై అత్యాచారాలను నిరసిస్తూ క్రొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించింది. గ్యాలరీ నిర్వాహకురాలు సంధ్య రంగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, కళాకారులు, మహిళా నేతలు, అధికారులు పాల్గొన్నారు. న్యాయమూర్తి ఎం.సుధ, ప్రాజెక్ట్ డైరెక్టర్ సరోజిని దేవి, టి.అరుణ, పి.రాజ్యలక్ష్మి, డాక్టర్ నూనె అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సుధ మాట్లాడుతూ చిన్నారులపై అత్యాచారాలను నాగరిక సమాజం తీవ్రంగా ఖండించాలనీ, వారి రక్షణ పల్ల సమాజం, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్యాలరీ నిర్వాహకురాలు సంధ్య మాట్లాడుతూ ఆడపిల్లలను బంగారాని కన్నా మిన్నగా చూసుకోవాలన్నారు. వారి రక్షణ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *