లగ్జరీ బస్సుల్లో ఏసి

ఏసీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతున్నందున సూపర్‌ లగ్జరీ బస్సుల్లో మార్పులు చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. సగం సీట్ల వరకూ ఏసీ సౌకర్యం కల్పించేలా బస్సును రూపొందించారు. మిగిలిన సగం సీట్లను నాన్‌-ఏసీగానే ఉంచనున్నారు. ఈ డిజైన్‌కు అనుగుణంగా బస్సు పికప్‌ ఉంటుందో లేదో కూడా పరిశీలన చేశారు. త్వరలో ఈ తరహా బస్సును విజయవాడ- ఒంగోలు మధ్య ప్రయోగాత్మకంగా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వంద కి.మీ.పైబడిన ప్రాంతాలకు ఏసీ బస్సులు నడపాలని ప్రయాణికుల నుంచి సూచనలు అందుతున్నాయి. సామాన్య ప్రయాణికులకు కూడా ఏసీ సౌకర్యం కల్పించడంపై ఇటీవల ఆర్టీసీ అధికారులు కసరత్తు చేశారు. ‘ఇంద్ర’ బస్సులకంటే కాస్త తక్కువ ధరలో ఏసీ బస్సు నడపాలంటే సూపర్‌లగ్జరీలో మార్పులు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ బస్సులు 165 హెచ్‌పీ బస్సులు కావడంతో సాంకేతికంగా పికప్‌ సాధ్యమా? అనే ప్రశ్న వచ్చింది. తొలి సగం సీట్లనీ నాన్‌ఏసీగా ఉంచి మిగిలిన సగం సీట్లకు ఏసీ ఇచ్చేలా విభజన చేయడంతోపాటు ఏసీ యంత్ర సామర్థ్యంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించారు. 20 కిలోవాట్ల ఏసీ యంత్రం వాడినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *