నెల్లూరు సమస్యలు తక్షణం పరిష్కారం

అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం 

ఆత్మీయ సమావేశం నిర్వహించిన రమేష్ రెడ్డి, అనూరాధ 

నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 13, 15, 16 డివిజన్లలోని స్థానికులతో తాళ్లపాక రమేష్ రెడ్డి, మాజీ మేయర్  అనురాధ ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశం లో మంత్రి నారాయణ పాల్గొన్నారు.నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, అధ్యక్షుడు శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నగర మునిసిపల్ కమిషనర్ అలీం భాష, స్థానిక కార్పొరేటర్ లు, ఇతర నాయకులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో స్థానికులు అనేక సమస్యల్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి నారాయణ అక్కడికక్కడే ఈ సమస్యల పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు.మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని మరో 10 నెలల్లో నిజమైన స్మార్ట్ సిటీగా చేయబోతున్నామని తెలిపారు. అలాగే భూగర్భ డ్రైనేజీ, వాటర్ పైప్లైన్ పనుల వల్ల రోడ్లను ఎక్కువగా తవ్వడం జరిగిందని అందువల్ల స్థానికులు కొంత ఇబ్బంది పడుతున్నారని అయితే అతి త్వరలో నగరంలో 450 కిలోమీటర్ల మేర పూర్తిగా కొత్త రోడ్లను నిర్మిస్తామని తెలిపారు.ఇందుకోసం అధికారులు 500 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ఈ నిధులను ముఖ్యమంత్రి గారు వెంటనే మంజూరు చేశారని ఆయన తెలియజేశారు.ఇందువల్ల మొత్తంగా నెల్లూరు నగరంలో పదహారు వందల కోట్లతో భూగర్భ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్లు రోడ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తిచేసి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోనే నెల్లూరు నగరానికి అత్యధికంగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరఫున ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.గత రెండు సంవత్సరాల్లో దాదాపు 90 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. నగరంలో అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు అండర్ ప్యాసేజీలు ఇతర బ్రిడ్జి లను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధమైనవని తెలియజేశారు.కృష్ణపట్నం పోర్టు (ముత్తుకూరు) రోడ్డు వలన నగరంలో రద్దీ పెరుగుతోందని, ఇందుకు నెల్లూరుకు రింగురోడ్డు నిర్మించడం ఒక్కటే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. నెల్లూరుకు రింగురోడ్డు నిర్మాణం కోసం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి కన్సల్టెంట్ ను నియమించామని తెలియజేశారు.అలాగే నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్లు పనుల కోసం తీసుకున్న రుణం ప్రజలపై భారంగా మారకూడదని, అందుకే ముఖ్యమంత్రి గారు గత క్యాబినెట్ లో హడ్కో రుణాన్నిi ప్రభుత్వమే చెల్లించే విధంగా తీర్మానం చేశారని ఆయన తెలియజేశారు.

కొంతమంది ప్రతిపక్ష నాయకులు పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అయితే నెల్లూరు ప్రజలు విజ్ఞతతో వ్యవహరిస్తూ సంయమనం పాటిస్తున్నారని అందుకు నెల్లూరు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పనులన్నీ పూర్తి కావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని అంతవరకు నగర ప్రజలు కొంత సర్దుకుపోవాలని మంత్రి తెలిపారు.మరీ ముఖ్యంగా నెల్లూరు నగరంలో పేదలు నిరుపేదలైన వారందరికీ ఇళ్లను అందించే ఉద్దేశ్యంతో నగరానికి 44 వేల ఇళ్ళను ప్రభుత్వం మంజూరు చేసిందని జనార్దన్ రెడ్డి కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఈ పేదల ఇళ్లను అత్యుత్తమ టెక్నాలజీతో, అత్యున్నత ప్రమాణాలతో 4800 ఇళ్ళను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నామని, ఈ పనులు దాదాపు 70శాతం పూర్తయ్యాయని మంత్రి తెలియజేశారు.అందరికీ అధికారులే వెంటపడి మరీ ఇళ్లను కేటాయిస్తారని, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో మాట్లాడిన పలువురు వక్తలు మంత్రి నారాయణ నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం, నెల్లూరు సిటీ సుందరీకరణ కోసం, మౌలిక వసతుల కల్పన కోసం చేస్తున్న కృషిని కొనియాడారు.నుడా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నారాయణ వలె పనిచేసే మంత్రిని చూడలేదని కొనియాడారు. ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మంత్రిగారు కారులో ప్రయాణించే సమయంలో కూడా నిరంతరం నగర అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడుతూ ఉంటారని తెలిపారు.మాజీమంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రాజీ పడకుండా పనిచేసిందని తెలిపారు.శ్రీమతి అనురాధ మాట్లాడుతూ మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరంలో మురుగునీటి వ్యవస్థ, మంచినీటి సరఫరా, రోడ్లు వంటి మౌలిక వసతులతో పాటు పార్కులు, స్మశానాలు కూడా అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *