రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు

రాష్ట్రంలో రూ.80 కోట్ల అంచనా వ్యయంతో 203 అన్న క్యాంటీన్లను నిర్మించాలని మంత్రిమండలి నిర్ణయించింది.71 పట్టణాలు, సీఆర్‌డీఏ పరిధిలోనూ వీటిని నిర్మిస్తారు.వీటి నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను వివిధ శాఖలు పట్టణాభివృద్ధి-పురపాలక శాఖకు బదలాయించాల్సి వుంటుంది.కేటరింగ్ సేవలకు రూ. 164 కోట్లు ఖర్చు కానుండగా, ఎన్జీవోలు, ట్రస్టులు, సొసైటీల నుంచి ఈ సేవలు పొందాల్సి వుంది.క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి ఐటీ, ఐవోటీ సేవలకు రూ. 3 కోట్లు ఖర్చు కానుందని అంచనా.అల్పాహారం, భోజనం ఏదైనా రూ. 5కు ఇవ్వాలని నిర్ణయించింది. ఓ వ్యక్తి రోజుకు మొత్తం రూ. 15కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం-రాత్రి భోజనం చేయొచ్చు.అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం కమిటీల ఏర్పాటుకు అనుమతి.
రేషన్ షాపుల ద్వారా బీపీఎల్ కార్డులకు కందిపప్పు పంపిణీ :బీపీఎల్ రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే నిమిత్తం మార్క్‌ఫెడ్ ద్వారా కందిపప్పును కొనుగోలు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కిలో రూ.40 ధరకు నెలకు 2 కిలోల చొప్పున అందించేందుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం.ఇందుకు అవసరమైన రూ.131 కోట్ల రాయితీని పౌర సరఫరాల శాఖకు అందించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం.కందిపప్పు పంపిణీ నిమిత్తం రేషన్ దుకాణాల డీలర్లకు బియ్యం మాదిరిగానే కిలోకు 70 పైసల చొప్పున కమీషన్ ఇస్తారు.బహిరంగ మర్కెట్ ద్వారా కందిపప్పును కిలో రూ.63.75 చొప్పున కొనుగోలు చేస్తారు. ఇందులో రూ.24.30 చొప్పున రాయితీగా ప్రభుత్వం భరించనుంది.ఏపీ మార్క్‌ఫెడ్ దగ్గర వున్న 84 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు నిల్వలలో 53,760 మెట్రిక్ టన్నుల కందిపప్పును పేద ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ఎం-పార్క్స్ పాలసీ‘ఎం-పార్క్స్ పాలసీ 2018-23’కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.ఎంఎస్‌ఎంఈ పార్కులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించి ఈ పాలసీకి రూపకల్పన.రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కొత్త పాలసీతో ప్రోత్సాహం.ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, పార్కులు ఏర్పాటు చేసి వాటిలో సంపూర్ణంగా మౌలిక సదుపాయాల కల్పన.ఒక్కో ఎం-పార్కులో రూ. 225 కోట్ల పెట్టుబడులు, 1500 మందికి ఉద్యోగాలు వచ్చేలా 150 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం.రాష్ట్రం మొత్తంమీద 200 ఎం-పార్కులు ఏర్పాటు చేసి 30 వేల ఎంఎస్ఎంఈలు నెలకొల్పేలా చూడటం ద్వారా రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఉద్యోగాల కల్పన పాలసీతో సాధ్యపడుతుంది.

ఇ-రిక్షా, ఇ-కార్డు, ఇ-ఆటోలకు జీవిత పన్ను మినహాయింపు

‘ఆంధ్రప్రదేశ్ మోటర్ వెహికల్స్ టాక్సేషన్ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ 2018’కు మంత్రిమండలి ఆమోదం.బ్యాటరీ ఆధారంగా నడించే ఇ-రిక్షాలు, ఇ-కార్టులు, అలాగే నలుగురు ప్రయాణించే ఆటో రిక్షాలకు, 3 టన్నుల సామర్ధ్యం మించని తేలికపాటి సరుకు రవాణా వాహనాలకు ప్రస్తుతం అమలవుతున్న జీవిత పన్ను పరిధి నుంచి తప్పిస్తూ నిర్ణయం.‘ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ యాక్ట్ 1963’ దీనిని పొందుపరుస్తారు.రవాణా శాఖ, వాహన యజమానికి ఉపయుక్తంగా వుండేలా త్రైమాసికం లేదంటే ఏడాదికి ఒకసారి పన్ను చెల్లించేలా వెసులుబాటు దీని ద్వారా కలుగుతుంది.

ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ :

‘ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2018-23’కి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అలాగే అడ్వాన్డ్స్ బ్యాటరీలు-చార్జింగ్ పరికరాల తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఈ పాలసీతో సాధ్యపడుతుంది.ఈ రంగంలో నెలకొన్న పోటీ వాతావరణాన్ని రాష్ట్రం అందిపుచ్చుకునే విధంగా పాలసీకి రూపకల్పన.

టీటీడీ అర్చకుల సర్వీసు క్రమబద్దీకరణ:

తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న మిరాశీయేతర అర్చకులు 32 మంది సర్వీసును క్రమబద్దీకరించడానికి మంత్రిమండలి ఆమోదం. గతంలో పద్మావతి అమ్మవారి ఆలయంలో మిరాశీయేతర అర్చకుల సర్వీసును క్రమబద్దీకరించిన విధానమే వీరికీ వర్తింపచేస్తూ నిర్ణయం.
రైతు సాధికార సంస్థకు రూ.వెయ్యి కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ కొనసాగింపు:రాష్ట్ర వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన రూ.1000 కోట్ల రుణానికి గాను ప్రభుత్వం హామీని మరో ఏడాదిపాటు కొనసాగించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. 7.90 శాతం వడ్డీ రేటుతో ఆంధ్రాబ్యాంక్ రైతు సాధికార సంస్థకు ఈ రుణం అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *