నేటి నుంచి పవిత్ర రంజాన్

పవిత్ర రంజాన్‌ మాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో నేటి నుంచి రంజాన్‌ మాసం ప్రారంభమవుతుందని సౌదీ అరేబియాలోని షాహి ఇమామ్‌ ప్రకటించారు.దీంతో గురువారం నుంచి ప్రత్యేక ప్రార్థనలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కఠిక ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులు నిర్వహిస్తారు.దేశంలో కూడా నెలవంక కూడా ముందుగా చెన్నైలో కనిపించింది. తరువాత అనేక నగరాల్లో దర్శనమిచ్చింది. షబబన్‌ మాసం బుధవారంతో ముగియనుందని, రంజాన్‌ మాసం గురువారంతో ప్రారంభమవుతుందని ప్రకటించారు.రంజాన్‌ పవిత్ర మాసాన్ని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం, మంచి పనులు చేయడం గడపాలని వారు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *