పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో నిన్నటి నుంచి ఆర్మీ బలగాలు కార్డ్ ఆన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నట్లుగా ఆర్మీ పసిగట్టింది. ఉగ్రవాదులు కాల్పులు జరపగానే ఆర్మీ కూడా కాల్పులు జరిపింది. అందులో ఇద్దరిని ఆర్మీ జవాన్లు మట్టుబెట్టారు. అందులో ఎల్‌‌ఈటీ టాప్ కమాండర్ వసీం షా ఉన్నట్లు సమాచారం.నిన్న హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన కీలక ఉగ్రవాదిని ఆర్మీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పుల్వామా అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు శుక్రవారం ఉదయం నుంచి కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. పశురా అడవుల్లో భద్రతా బలగాలు జరిపిన గాలింపుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన గుల్జల్‌దార్ అనే ఉగ్రవాది పట్టుపడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *