ఒంగోలులో రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్

సినిమా, షాపింగ్ లో సరికొత్త అనుభూతి

రేపే ప్రారంభం..రానున్న పూజా హెగ్డే 

వినోద, షాపింగ్ రంగంలో ఒంగోలు నగర ప్రజలు సరికొత్త అనుభూతిని పొందునున్నారు. ఈనెల 22న ప్రారంభం ఒంగోలులోని గుంటూరు రోడ్డులో సినిమా థియేటర్లు, షాపింగ్ సముదాయంతో కూడిన ‘రవిప్రియ మాల్ – మల్టీప్లెక్స్ ’ ప్రారంభం కానుంది. ఈ మేరకు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ లతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాధ్, డైరెక్టర్లు కంది విష్ణుమోహన్, కంది విజయసాయిలు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మూడు సినిమా థియేటర్లతో పాటు ‘వి’ గేమింగ్ జోన్, 7డి, 3డి గేమ్స్, కె.ఎఫ్.సి, పిజ్జా హట్, ఫుడ్, క్రీమ్ స్టోన్, అంతర్జాతీయ బ్రాండ్ ‘మ్యాక్స్’ షోరూం కూడా రవిప్రియ మాల్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈనెల 22 బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రముఖ సినీ నటి పూజా హెగ్డేతో పాటు అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితర ప్రముఖులు రవిప్రియ మాల్ – మల్టీప్లెక్స్ ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *