ఇది పాఠశాలా..డంపింగ్ యార్డా..!

వ్యర్ధాలను, చెత్తా చెదారాన్ని
వదిలి వెళ్ళిన టపాసుల వ్యాపారులు

ఒంగోలు పట్టణంలో ప్రముఖ పాఠశాల పి.వి.ఆర్. హైస్కూల్ క్రీడా మైదానంలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులు అమ్మకాలు కోసం షాపులు ఏర్పాటు చేశారు. మందులు అమ్ముకున్నారు..ఆ తరువాత తట్టా బుట్ట సర్దుకుని వెళ్ళిపోయారు. టపాసులు అమ్ముకోగా మిగిలిన చెత్తా చెదారం, వ్యర్ధాలను మాత్రం అలాగే వదిలి వెళ్ళిపోయారు. దీంతో పాఠశాల

కొల్లా మధు
సిటిజన్ ఫోరం

ఆవరణ డంపింగ్ యార్డును తలపిస్తోంది. పచ్చదనం-పరిశుభ్రత, దాని తాలూకు ‘స్వచ్ఛ ఒంగోలు’ను పర్యవేక్షించేదీ, అమలు చేసేదీ ఇలాగేనా..! వ్యాపార్తస్తుల్లో మార్పు రావటం లేదు. నగరంలో ప్లాప్టిక్ నిషేధం అమలవుతున్న వారికి ఆ స్పృహ ఉండటం లేదు. టపాసుల వ్యర్ధాల, దాని వల్ల కలిగే కాలుష్యం వద్ద పాఠశాలకు వచ్చే విద్యార్ధులు అనారోగ్యానికి గురయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు..! పాఠశాల మైదానంలో ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఎగ్జిబిషన్ కు వచ్చే వారు ఆ కాలుష్యాన్ని భరించాలా..! నగర పాలక సంస్థ అధికారులు తక్షణం స్పందించాలి. పాఠశాల ఆవరణలో ఎవరు ఎలాటి కార్యక్రమాలు నిర్వహించినా అవి ముగిసిన తరువాత వారి వ్యాపారాల తాలూకు వ్యర్ధాలను, ఇతర చెత్తా చెదారాన్ని తొలగించే విధంగా షరతు విధించాలి. ‘‘నగరాన్ని పచ్చగా ఉంచుదాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’

టపాసుల అమ్మకందారులు వెళ్ళిపోయాక పాఠశాల ఆవరణ ఎలా ఉందో చూడండి..

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *