ఆయూబ్ కు ‘అరుణాం‘జలి

నీ గురించి నేనేమి వ్రాయలేను అయూబ్ ..చెమరిస్తున్న కళ్ళు ..నావేళ్ళను ముందుకు సాగనివ్వడంలేదు…తన మానవత్వపు ఖజానాలో దేవుడికి కాస్త సంపద తగ్గిందంట ..ఆలోటు పూడ్చుకునేందుకు నిన్ను పిలిచాడని నేను విశ్వసిస్తున్న …ఇంకా గుండె లోతుల్లోనుంచి పిలిచే అక్క అనే పిలుపు వినబడనుకుంటే మనసు కుమిలిపోతోంది నీ పార్థివ దేహం ఆచం నిదురిస్తున్నట్లే ఉంది ..కళ్ళుతెరిచి అక్క వచ్చావా అని అడుగుతావనుకున్న ఇది కల అయితే బాగుండు అనుకున్న కానీ నిజమే ..నీచిరునవ్వును మృత్యువు దొంగిలించుకొని పోయిందికూడా నిజమే ..తెలుగు..భాషను అద్భుతంగా ఉచ్చరించి….స్పష్టమైన భావవ్యక్తీకరణ తో ఎదుటివారిని ఆకట్టుకొనే నా సోదరుడి పలుకులు ఇక వినలేమని అనుకుంటే మనసు నిస్సారమై పోతోంది ..రాజకీయాలలో ఉంటూ …సున్నితత్వాన్ని.. ..పోగొట్టుకోని..వ్యక్తిత్వమనేది .కొందరికే సాధ్యం ..నీకది జన్మ సంస్కారం అయ్యింది ..సూటిగా సున్నితంగా ..ఒక..వ్యక్తిగా ..కొడుకుగా భర్తగా తండ్రిగా ..స్నేహితుడిగా ..నీసంస్కృతి కాపాడుకుంటూనే …లౌకికవాదిగా రాజకీయనాయకుడిగా సంస్కరణవాదిగా బహుముఖ పాత్రలు సమర్ధవంతంగా నడిపించి జీవనయాత్రకు తెర దింపి ఇక సెలవంటూ అర్ధాంతరంగా తిరిగిరానిలోకాలకు వెళ్ళిపోయిన ప్రియమైన సోదరుడా…నీమరణాన్ని మేము ఎప్పటికి ..నమ్మమని ..నమ్మలేమని …నీ..జ్ఞాపకాలు..నీవారసుల్లో నీ హితుల్లో ..పరిసరాల్లో ..మననం చేసుకుంటూ …తలచుకుంటూ …ఎదో ఒకచోట ..చిరునవ్వుతో పలకరిస్తావనే ఆశతో ఎదురు చేస్తూ ..నీకోసంతపించే ..అరుణక్క ….నీకునేను జోహార్లు ..చెప్పలేను …ఎందుకంటే..నీవు మా జ్ఞాపకాల్లో నిరంతరం జీవించే ఉంటావనే ..నమ్మకంతో …ప్రేమతో ..

టి.అరుణ
ఎ.పి మహిళాభ్యుదయ సమితి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *