హరహర క్షేత్రంలో ఏకాదశి పూజలు

కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా చీమకుర్తి హరిహర క్షేత్రంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిహర క్షేత్రంలో కొలువైన సకల దేవతలకు విశేష పూజలు,విఘ్నేశ్వరుని గంగ పూజ,అయ్యప్పస్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, శిద్దా వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ అద్వర్యంలో సర్వ దీక్ష స్వాములకు అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ప్రముఖ వేద పండితులు నెలబోట్ల రామకృష్ణ శాస్త్రి, హరి హర క్షేత్ర ఆలయ అర్చకులు సుబ్రమణ్యం భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. ఆలయ మేనేజర్ అద్దంకి రామచంద్ర మూర్తి కార్యక్రమ నిర్వహకులుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో శిద్దా వెంకటేశ్వర రావు, శిద్దా వెంకట సుబ్బారావు, శిద్దా పాండురంగారావు, శిద్దా సాయిబాబు, శిద్దా పెద బాబు, శిద్దా సుధీర్, శిద్దా సుధాకర్ పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *