హనుమారెడ్డి అంతర్వాహిని : 24న గ్రంధావిష్కరణ


ప్రకాశం జిల్లా రచయితల సంఘం (ప్రరసం) అధ్యక్షుడు బి.హనుమారెడ్డి ఆత్మకథ అంతర్వాహిని గ్రంధావిష్కరణ సభ ఈనెల 24 శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఒంగోలులోని ఎన్.టి.ఆర్ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు సంఘం కోశాధికారి యత్తపు కొండారెడ్డి తెలిపారు. సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వేంకటశ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించనున్న సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘరావు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య గ్రంధాన్ని ఆవిష్కరించనున్నారు. ఆత్మీయ అతిథులుగా జడ్ పి చైర్మన్ ఈదర హరిబాబు, శాసనమండలి సభ్యులు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శాసనసభ మాజీ సభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి, ఏపి ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) పాల్గొననున్నారు. ఈ గ్రంధాన్ని హనుమారెడ్డి సతీమణి సుశీలకు అంకితం చేయనున్నారు. ప్రముఖ కవి, సాహితీవేత్త బీరం సుందరరావు గ్రంధాన్ని సమీక్షించనున్నారు. కవులు, కళాకారులు, రచయితలు, సాహిత్యాభిమానులు ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *