సాగునీటికి ఇబ్బంది లేదు

సాగర్ ప్రవాహాన్నిపరిశీలించిన

మంత్రి శిద్దా, కరణం బలరాం

సంక్రాంతి నాటికి దర్శిలో

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ రెడీ

జిల్లాలో సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అధికారులను ఆదేశించారు. బుధవారం దర్శి వద్ద ఒంగోల్ బ్రాంచ్ కెనాల్ నీటి ప్రవాహాన్ని ఆయన సాగునీటి సరఫరా అధికారులు, శాసనమండలి సభ్యుడు కరణం బలరాంతో కలిసి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా జిల్లా సరిహద్దు 85/3 సాగర్ కాలువ వద్ద 3200 క్యూసెక్కుల నీటి ప్రవాహం తగ్గకుండా సరఫరా చేయాలని ఎన్. ఎస్.పి అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతులు ఆందోళన చెందనవసరము లేదనీ, సాగర్ కాలువల ద్వారా వారము రోజుల పాటు ఇదే విధంగా నీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.అనంతరం దర్శి

సాగర్ ప్రవాహాన్ని పరిశీలిస్తు్న శిద్దా, కరణం బలరాం

నియోజకవర్గ కేంద్రంలో 25 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూలు నిర్మాణ పనులను పరిశీలించారు పుణె తరువాత 7 ట్రాక్స్ తో ఉన్నత ప్రమాణాలతో దర్శిలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దర్శిలో సంక్రాంతి నాటికి అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆర్.బి. అధికారులను ఆదేశించామన్నారు. ట్రాక్స్ కు అవసరమైన మిషన్స్, పరికరాలు ఏర్పాటు చేయవసిందిగా రవాణా శాఖ అధికారులను ఆదేశించామన్నారు. దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ లో 5 కోట్ల రూపాయల తో కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. కురిచేడు లో 30 కోట్ల రూపాయల తో సోషవెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ఏర్పాటు

డ్రైవింగ్ స్కూలు పనులను పరిశీలిస్తున్న దృశ్యం

చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ పనులు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులు సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. తాళ్లూరు మండలం మోగిలిగుండాల ప్రాజెక్టు ను 40 కోట్ల రూపాయల తో నిర్మించడానికి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.ఈ ప్రాజెక్టు వల్ల 12 గ్రామాలకు త్రాగునీరు, 5 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీపీ పి.సంజీవయ్య, దర్శి వైస్ ఎంపీపీ మారo శ్రీనివాస్ రెడ్డి, కనీస వేతనాలు అమలు బోర్డ్ డైరెక్టర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *