చీరాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

పాల్గొన్న మంత్రులు శిద్దా, నారాయణ

జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎంపి మాల్యాద్రి

చీరాల నియోజకవవర్గంలో శనివారం అనేక అభివృద్ధి పనులనూ, నిర్మాణాలను రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణలు ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రకమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వేటపాలెం స్టేషన్ రోడ్ నుండి ఒంగోలు రోడ్ వరకు రూ.1.14 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు నిర్మాణం, విస్తరణ, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంతో పాటు నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. వేటపాలెం సెంటర్లో రూ.4 లక్షల నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ ను కూడా ప్రారంభించారు. అదే ప్రాంతంలో 12 లక్షలతో నిర్మించిన కూరగాయలు, చేపల మార్కెట్ ను కూడా ప్రారంభించారు. ఈ కార్య్రకమంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తో పాటు బాపట్ల ఎంపి శ్రీరాం మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *