హనుమారెడ్డి అంతర్వాహిని ఆవిష్కరణ

ప్రకాశం జిల్లా రచయితల సంఘం (ప్రరసం) అధ్యక్షుడు బి.హనుమారెడ్డి ఆత్మకథ అంతర్వాహిని గ్రంధావిష్కరణ సభ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఒంగోలులోని ఎన్.టి.ఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య గ్రంధాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రంధాన్ని హనుమారెడ్డి సతీమణి సుశీలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా హనుమారెడ్డి, సుశీల దంపతులను ఆహుతులు ఘనంగా సత్కరించారు. ప్రముఖ కవి, వ్యాఖ్యాత పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, శాసనమండలి సభ్యులు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసరెడ్డి, నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న) తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

హనుమారెడ్డి దంపతులను సన్మానిస్తున్న దృశ్యం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *