లారీ ఎక్కిన విమానం.. 

నెల్లూరు : నెల్లూరు జాతీయ రహదారిపై విమానం లారీ ఎక్కి ప్రయాణం చేయడం చూపరులను ఆకట్టుకుంది.   సోమవారం ఆ విమానం, వాహన చోదకులను, స్థానికులను కనువిందు చేసింది.  మరమ్మత్తులకు గురైన ఆ విమానాన్ని చెన్నై నుండి విశాఖకు ట్రాలీ ద్వారా జాతీయ రహదారిపై తరలించారు.  లారీ ద్వారా తరలిస్తున్న ఈ విమానంకు వెనుక భాగం, ముందు భాగంగ దెబ్బతిని ఉన్నాయి.  రెండు ప్రక్కల రెక్కలు కూడా లేవు. తడ నుండి కావలి వరకూ ఉన్న 16వ జాతీయ రహదారిపై వెళ్లే వారు ఈ విమానాన్ని ఆసక్తిగా తిలకించారు. అక్కడక్కడా లారీ ఆగిన సమయాల్లో కొందరు దాని వద్దకెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *