గ్రామీణ వైద్యులుగా గుర్తింపునిస్తాం !

వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి

ఆర్ ఎం పీ, పీఎంపీ వైద్యులకు శిక్షణ ఇచ్చి గ్రామీణ వైద్యులుగా తగు గుర్తింపునిస్తామని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయిరెడ్డి హామీనిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా వైద్య విభాగం ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులతో ఆత్మీయ సదస్సు జరిగింది. సదస్సుకు వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జీ శివ భరత్ రెడ్డి అధ్యక్షత వహించారు. సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నాడు వైఎస్ హయాంలోనే శిక్షణ ఇచ్చి గుర్తింపునివ్వాలని

సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

నిర్ణయించినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా గ్రామీణ వైద్యులకు ద్రోహం చేసిందని విమర్శించారు. ఇతర దేశాల్లో ఆరోగ్యానికి 12 శాతం బడ్జెట్లో కేటాయిస్తుంటే.. టీడీపీ ప్రభుత్వం 4 శాతం మాత్రమే కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యం బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుందన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ పేదలకు ద్రోహం చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సదస్సులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదాల అశోక్ బాబు, బాషా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *