పిటిసిలో సైబర్ క్రైమ్ పై శిక్షణ

ఒంగోలులోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పిటిసి)లో సైబర్ క్రైమ్ పై శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. మూడురోజుల పాటు నిర్వహించనున్న సదస్సును పిటిసి ప్రిన్సిపల్ ఎం.సుందరరావు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ పై శిక్షణ తీసుకునేందుకు విజయవాడ నుంచి ఒక డిఎస్పీ, ఇద్దరు ఎస్.ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్ళు, గుంటూరు అర్బన్ పోలీస్ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఒక అదనపు ఎస్.పి, ఇద్దరు డిఎస్పీలు, అయిదుగురు ఎస్.ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్ళు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ పై వీరికి శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి ఫాకల్టీ పి.వంశీతో పాటు బి.అంకమ్మరావు, బి.వి.వి సుబ్బారావులు హాజరయ్యారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *