ఆదరణ-2 లక్ష్యాలను పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాలు 

అధికారుతో వీడియో కాన్ఫరెన్స్ 

జిల్లా కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అధికారులు

జిల్లాలో ఈ నెల7 వ తేదీ నాటికి ఆదరణ-2 లక్ష్యాలను నూరుశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులు, ఎంపీడీఓ లు, తహసిల్దార్లతో ఆదరణ-2 పధకం పై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బి.సి జనాభా ప్రాతిపదికన ఆదరణ యూనిట్ల ను మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లాలో ఆదరణ పధకం అమలు పై లబ్ధిదారు లు అసంతృప్తి గా ఉన్నారన్నారు. జిల్లాలో మున్సిపల్ కమిషనర్లు ,ఎంపీడీఓలు, లబ్ధిదారుల ఇంటికి వెళ్లి లబ్ధిదారుల వాటా సేకరించి వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో అధికారులు కూర్చుని ఆదరణ-2 గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదరణ పధకం క్రింద 90 శాతము ప్రభుత్వం భరిo చడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. జిల్లాలో ఆదరణ 2 లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. ఎంపీడీఓ లు,మున్సిపల్ కమిషనర్లు పూర్తి స్థాయిలో ఆదరణ 2 పధకాన్ని గ్రౌండింగ్ చేయాలని ఆయన అన్నారు. జిల్లాలో 10 మండలాలు వెలిగండ్ల, కె.కె.మిట్ల, మర్రిపూడి, ఒంగోలు, యద్దనపూడి, కొత్తపట్నం, చీమకుర్తి, దర్శి,బేస్తవారి పేట, తర్లుపాడు మండలాలు ఆదరణ2 పథకo లక్ష్యాలను పూర్తి చేయడములో వెనుకబడి ఉన్నారన్నారు. జిల్లాలోడిసెంబరు 7 వతేది నాటికి లక్ష్యాలను పూర్తి చేయని అధికారుల పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం పనుల అధికారులు దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో బి.సి.కార్పొరేషన్ ఇ. డి. నాగేశ్వరరావు, మెప్మా పి.డి. సింగయ్య, జిల్లా పంచాయతీ అధికారి ప్రసాద్, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ కైలాష్ గీరేశ్వర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజ్యలక్ష్మి, స్టెప్ సి.ఇ. ఓ బి.రవి,డి.ఆర్.డి.ఎ ,పి.డి నరసింహాలు, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర రావు, మైనార్టీ వెల్ఫేర్ ఇ. డి. సిరాజుల్లా తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *