బాలికల విద్యకు ప్రోత్సాహం : శిద్దా సుధీర్

బాలికల విద్య-సంరక్షణ కోసం ఉప్పలపాటి రాణా చేపట్టిన స్కేటింగ్ సాహసయాత్ర కు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని యువ పారిశ్రామికవేత్త, టిడిపి నేత శిద్దా సుధీర్ కుమార్ తెలిపారు. సోమవారం రాణాను ఒంగోలు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో అభినందించారు. 25 వేల మంది బాలికలకు ఆర్ధిక చేయూత అందించేందుకు రాణా సేకరిస్తున్న విరాళాలకు తన వంతు సాయంగా రూ.2 లక్షలు అందచేయనున్నట్లు తెలిపారు. బాలికల విద్యను పెంపొందించాలనీ, సమాజంలోని ప్రతి ఒక్కరు ఆడపిల్లల చదువుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నేతలు దామచర్ల సత్య, కరణం వెంకటేష్, కొండెపి శాసనసభ్యుడు డోలా వీరాంజనేయస్వామి, రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ ఏ.వి.భాస్కర్, జిల్లా పి.ఇ. టి.అసోసియేషన్ నేత శీనయ్య, విద్యార్థి జెఎసి నేతలు జగదీష్, సింగరాయకొండ ఎస్.ఐ.నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *