సంక్రాంతి నాటికి మినీ గోకులం పనులు

పశుగ్రాసం పెంపుదలపై నిర్లక్ష్యం
అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం

జిల్లాలో పశుసంవర్ధక శాఖ ద్వారా మంజూరు చేసిన వెయ్యి మినీ గోకులం పనులను సంక్రాంతి నాటికి నూరుశాతం పూర్తి
చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో
లొ ఉపాధి హామీ పథకం నిధుల తో అనుసంధానం చేసిన చేపట్టిన పనుల పురోగతి పై పంచాయతీ రాజ్, ఐసీడీస్,ఎస్.ఎస్.ఎ, పశుసంవర్ధక శాఖ,మత్య శాఖ అధికారులు తో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మినీ గోకులాలు, పశుగ్రాసం పెంచటం వంటి అంశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో వర్షపతం తక్కువగా నమోదయిన విషయాన్ని ఈ సంద్భంగా గుర్తు చేశారు. జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందన్నారు. పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టుపరిశ్రమల శాఖ ద్వారా మంజూరు చేసిన 442 షెడ్ పనులను ఈ నెల 10 వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం మంజూరు అయిన 122 యూ నిట్ల ను కూడా వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధుల తో చేపట్టిన 350 స్కూలు ప్రహరీగొడ నిర్మాణాలను డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్. టి.ఆర్.జలసిరికి పధకం క్రింద మంజూరు చేసిన 4 వేల బోర్లను 10 రోజుల్లో వేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రబీ సాగుకు రైతులకు బోర్ల ద్వారా సాగునీటి ని అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీపీఓ వెంకటేశ్వర్లు, డ్వామా పి.డి. వెంకటేశ్వర్లు, ఐసీడీస్ పి.డి విశాలాక్షి, ఎస్.ఎస్.ఎ. ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *