విద్యార్థులకు ‘శ్రీరామ్’ హెల్త్ కార్డులు

ఉచితంగా ఓపి, వైద్య సేవలు 

కుటుంబసభ్యులకు 50 శాతం రాయితీ

ఒంగోలు సెయింట్ థెరిస్సా ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు డాక్టర్ చాపల వంశీక్రిష్ణ, డాక్టర్ చాపల శాంతికుమారి ఆద్వర్యంలో 350 మంది విద్యార్థులకు ఆరోగ్య రక్ష హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్ధుల సంఘం ఉపాధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చాపల వంశీక్రిష్ణ మాట్లాడు హెల్త్ కార్డుల ద్వారా తమ ఆసుపత్రిలో ఓపితో పాటు వైద్యసదుపాయాలను ఉచితంగా అందచేస్తామని తెలిపారు. కార్డుదారుని కుటుంబసభ్యులకు కూడా 50 శాతం రాయితీ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.బాలాస్వామిరెడ్డి, ఎన్.సి.సి అధికారి బొంతు ఆనంద్ రావు, సిటిజన్ ఫఓరం అధ్యక్షుడు కొల్లా మధు, చైతన్య స్వరభారతి అధ్యక్షుడు ఎన్.శరత్ బాబు, సీనియర్ పాత్రికేయుడు కావూరి సాంబశివరావు, ఫాదర్ ఇండ్లూరి హృదయరాజ్, సి.ఐ కిషోర్ కుమార్, చక్రపాణి, రామక్రిష్ణ తదితరులు పపాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *