రేవంత్ రెడ్డి విడుదల

హైకోర్టు మొట్టికాయలతో పోలీసులు దిగొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని ఎట్టకేలకు విడుదల చేశారు. జడ్చర్ల జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఆయణ్ని తరలించారు. భారీ పోలీసు భద్రత మధ్య రేవంత్‌ను కొడంగల్‌కు తరలించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు రేవంత్‌ను విడుదల చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. దీంతో అధికారులు ఆయణ్ని విడుదల చేశారు. కాంగ్రెస్ స్టార్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని సీఈవో రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు. రేవంత్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు రేవంత్‌ను విడుదల చేసి కొడంగల్ తరలించారు. రేవంత్ అరెస్టు విషయంలో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏ ఆధారాలతో రేవంత్‌ను అరెస్టు చేశారని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నియోజకవర్గంలో అల్లర్లు చెలరేగే ప్రమాదముందన్న ఇంటలిజెన్స్‌ నివేదికల మేరకు ఆయణ్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు సమాధానమివ్వగా.. ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

రేవంత్ అరెస్ట్ పై సీఈసీ సీరియస్

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కొడంగల్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేయడంపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ స్పందించారు. తాము ఎన్నికల నిబంధనలను పాటిస్తున్నామని, శాంతిభద్రతల అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిబంధనలను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, రేవంత్‌ కోరినట్లు ప్రచారం చేసేందుకు అవకాశం కల్పించామని వివరించారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు. దాంతో పాటుగా కేసీఆర్‌ సభకు వెళ్లి నిరసన వ్యక్తం చేయాలని, సభలో ఆందోళన చేపట్టేందుకు రేవంత్‌ తన అనుచరులను ప్రోత్సహించారని పోలీసులు భావించారు. దీంతో కొడంగల్‌లో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకూడదని మంగళవారం  తెల్లవారుజామున 3 గంటలకు బలవంతంగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.  రేవంత్‌ అరెస్టు వ్యవహారంపై డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారి నివేదికలు కోరినట్లు రజత్‌కుమార్‌ వివరించారు. కోస్గిలో మంగళవారం కేసీఆర్‌ సభ ముగిసిన తర్వాత రేవంత్‌‌తో పాటు ఆయన అనుచరులను విడుదల చేస్తామని ఎస్పీ అన్నపూర్ణ స్పష్టం చేశారు. పార్టీ కీలకనేత రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, తమను ఎదుర్కోలేక అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్‌ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్‌ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్‌ను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని పోలీసులను ప్రశ్నించింది. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని ప్రశ్నించింది. రేవంత్ రెడ్డి నిర్బంధంపై మంగళవారం= హైకోర్టు విచారణ చేపట్టింది. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌ రెడ్డి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.కేసీఆర్‌ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయణ్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పైవిధంగా వ్యాఖ్యానించిది. నిఘా వర్గాల సమాచారం మేరకే తాము రేవంత్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలపగా.. ఆధారాలు సమర్పించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *