సాహసక్రీడోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

ఒంగోలు మినీ స్టేడియంతో పాటు కొత్తపట్నం బీచ్ లొ ఈనెల 14,15,16 వ తేదీల్లో నిర్వహించనున్న సాహస క్రీడోత్సవాల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మంగళవారం తన చాంబరులో ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ నిశాంతి, సంయుక్త కలెక్టర్-2 డి.మార్కండేయులు, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, జిల్లా పర్యాటఖ శాఖ అధికారి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *