ఆదార్ వద్దును కుంటున్నారా.. !

అయితే, విత్ డ్రా చేసుకోవచ్చు

న్యూ డిల్లీ : మనిషి పుట్టినా ఆధార్.. చచ్చాక డెత్ సర్టిఫికెట్ కు ఆధార్.. ఇలా ప్రస్తుత సమాజంలో అన్ని పనులకు ఆధార్ ఉంటే నే ఐడెంటిటీ.. మనిషి చేతులకు ఉన్న వేలి ముద్రల నుంచి కంటి రెజినీ వరకు అంతా స్కాన్ చేసి ఆన్ లైన్ లో పెట్టిన కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టులు బాగా నే బుద్దిపెట్టాయి. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందంటూ చాలా మంది ఆధార్ తప్పనిసరి పై సుప్రీం కోర్టు లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యం లో ఆధార్ తప్పనిసరి కాదంటూ సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. దీంతో కేంద్రం దిగివచ్చి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వ్యక్తుల ఆధార్ డేటాను ప్రైవేటు సంస్థలు వాడరాదని ఆదేశాలిచ్చింది. ఆధార్ చట్టంలోని 57వ సెక్షన్ ను సైతం ధర్మాసనం కొట్టివేసింది. ఈ పరిణామంతో ఇక నుంచి బ్యాంకు ఖాతాలు మొబైల్ కనెక్షన్ కు ఆధార్ ను లింక్ చేయడం తగ్గించేశారు.కేంద్రం ఆదేశాలు అమల్లోకి వస్తే ఆధార్ కార్డు అవసరం లేదనుకున్న వాళ్లు అందరూ దాన్ని రద్దు చేసుకోవచ్చు. లబ్ధిదారులు గతంలో ఇచ్చిన బయోమెట్రిక్ తో పాటు డేటాను వెనక్కితీసుకోవడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఆధార్ ను వెనక్కి తీసుకోవడం పై ఆధార్ ను పర్యవేక్షించే యూ డీ ఏ ఐ కొత్త ప్రతిపాదన చేసింది. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా తమ ఆధార్ ను విత్ డ్రా చేసుకోవచ్చని.. 6 నెలలోపు ఈ పని పూర్తి చేస్తామని యూ డీ ఏ ఐ అధికారులు తెలిపారు. అయితే దీన్ని అందరికీ వర్తింప చేయాలని కేంద్ర న్యాయ శాఖ కోరుతోంది.

కొత్త ప్రతిపాదనలు

ఆధార్ చ‌ట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయ‌త్నిస్తోంది. చ‌ట్టంలో కొత్త ప్రతిపాద‌న‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. పౌరులు త‌మ ఆధార్ నెంబ‌ర్‌ను విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. బ‌యోమెట్రిక్స్‌తోపాటు డేటాను కూడా వెన‌క్కి తీసుకునే వెసులుబాటును క‌ల్పించాల‌ని కేంద్రం భావిస్తోంది. ఇటీవ‌ల ఆధార్‌ చట్టబద్దతపై సెప్టెంబరులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువరించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. ఆధార్ చ‌ట్టంలోని 57వ సెక్షన్‌ను రాజ్యాంగ ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. పౌరుల ఆధార్ డేటా వివరాలను ప్రైవేటు సంస్థ‌లు వినియోగించుకోరాద‌ని త‌న ఆదేశంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డుల‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని కూడా ధ‌ర్మాస‌నం వ్యతిరేకించింది. దీంతో ఆధార్ విత్‌డ్రా చేసుకునే విషయమై యూడీఏఐ కొత్త ప్ర‌తిపాద‌నలు చేసింది. 18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఎవ‌రైనా త‌మ ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు ఆరు నెల‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌నున్న‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించిన న్యాయ‌శాఖ‌.. దీన్ని ప్ర‌తి పౌరుడికి వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పాన్ కార్డు లేని వారికి మాత్రం ఈ కొత్త నిబంధ‌న ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపనున్నారు. దేశవ్యాప్తంగా 2018 మార్చి 12 వరకు 37.50 కోట్లు పాన్ కార్డులు జారీచేయగా, వీటిలో వ్యక్తిగత కార్డలు 36.54
కోట్లు. ఇప్పటి వరకు 16.84 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్ విషయంలో ఒక న్యాయనిర్ణేత అధికారిని నియమించాలని కేంద్రం భావించింది. జాతీయ భద్రత దృష్ట్యా పౌరుల వివరాలను బహిర్గతం చేసే ఆధార్ చట్టంలోని సెక్షన్ 33(2)ను సైతం సుప్రీంకోర్టు రద్దుచేసింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *