ఈనెల 12 నుంచి కవిత్రయ సాహిత్య సౌరభం

ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఈనెల 12 నుంచి 14 వరకు మూడురోజల పాటు ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు కవిత్రయ సాహిత్య సౌరభం నిర్వహించనున్నట్టు నాగభైరవ సాహిత్య పీఠం ఒక ప్రకటనలో తెలిపింది. 12న టి.అరుణ అధ్యక్షతన నిర్వహించనున్న సభలో ‘ఆదికవి నన్నయ’ అనే అంశంపై డాక్టర్ శ్రిష్టి చంద్రమౌళి శర్మ ప్రసంగించనున్నారు. 13న డాక్టర్ నూనె అంకమ్మరావు అధ్యక్షతన నిర్వహించనున్న సభలో ‘కవిబ్రహ్మ తిక్కన’ అనే అంశంపై సింహాద్రి జ్యోతిర్మయి ప్రసంగించనున్నారు. 14న కె.బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నసభలో ‘ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రాప్రగడ’ అనే అంశంపై ఉన్నం జ్యోతివాసు ప్రసంగించనున్నట్టు సాహిత్యం పీఠం తెలిపింది. సాహితీ ప్రియులందరూ ఈ సభలను విజయవంతం చేయాలని పీఠం ప్రతినిధులు కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *