పవన్ కన్నా నాకే ఫాలోయింగ్ ఎక్కువ : కెఎ పాల్

హైద్రాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే తనకే ఫాలోయింగ్ ఎక్కువని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. ఏపీలో ‘జనసేన’ లాంటి చిన్న పార్టీల మీటింగ్‌లకే అవకాశం ఇస్తున్నారని, కానీ తన మీటింగ్‌లను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. కేవలం 3 నుంచి 4 ఓటింగ్ శాతం ఉన్న జనసేనకి అనుమతి ఇచ్చి, తమకెందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తమ సభలకు లక్షల మంది వస్తారనే ఉద్దేశంతోనే అనుమతులు ఇవ్వడంలేదేమోనని అన్నారు. అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వాలు చొరవ చూపడం లేదని, తాను అభివృద్ధి చేస్తానన్నా చేయనివ్వడం లేదని తెలిపారు. నాకే ఫాలోయింగ్ ఎక్కువ: ‘‘ఇటీవల ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పా. ఆ వీడియోను యూట్యూబ్‌లో సుమారు 14 లక్షల మంది చూశారు. నేను ఇండియా వదిలి 30 సంవత్సరాలైంది. ఆంధ్రాలో ఉన్నది చాలా తక్కువ. అమెరికాలో నేను ఎంజిలినా జోలిని చూశా, షారుక్‌ఖాన్‌, అమితాబచ్చన్‌లను చూశా. అలాంటి నేను బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పడంలో ఏం తప్పు ఉంది? ఆ వీడియోను లక్షలు మంది చూశారు. అదే చానెల్‌లో పనవ్ కళ్యాన్ మాట్లాడితే 5వేలు, 10వేలు మంది మాత్రమే చేస్తున్నారు. అంటే, వాళ్లకంటే నాకు 100 రెట్లు ఫాలోయింగ్ ఉన్నట్లే కదా. ఈ ఫాలోయింగ్‌కు భయపడే బీమవరం సభకు అనుమతి ఇవ్వడం లేదు’’ అని పాల్ వ్యాఖ్యానించారు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *