ఎజ్రాశాస్త్రి ‘మా ఎర్ర ఓబనపల్లె’ పై సదస్సు

ప్రముఖ కవి, సాహితీవేత్త దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి రచించిన ‘మా ఎర్ర ఓబనపల్లె’ నవలపై ఈనెల 13 గురువారం సాయంత్రం 5.30 గంటలకు ఒంగోలులోని ప్రెస్ క్లబ్ లో సమీక్షా సదస్సు నిర్వహించనున్నట్టు కళల దండోరా ప్రకటించింది. ప్రముఖ రచయిత శ్రీరామకవచం సాగర్ అధ్యక్షతన నిర్వహించనున్న సభలో ప్రముఖ సాహితీవేత్తలు, ఉద్యమనేతలు డాక్టర్ నూకతోటి రవికుమార్, కొలకలూరి స్వరూపరాణి, పల్నాటి శ్రీరాములు, మొగిలి దేవ ప్రసాద్, బక్కా పరంజ్యోతి తదితరులు పాల్గొననున్నట్టు కళల దండోరా ప్రకటించింది. ఈ సదస్సుకు సాహితీ ప్రియులందరూ హాజరై విజయవంతం చేయాలని దండోరా ప్రతినిధులు కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *