రవిప్రియ మాల్ లో ‘కరాటే’ విన్యాసాలు

తథాగథ్ బోధి ధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలులోని రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కరాటే విన్యాసాలు విశేషంగా ఆకర్షించాయి. బ్లాక్ బెల్టర్స్ డి.వెంకటేష్, జి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కరాటే ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్ చైర్మన్ కంది రవిశంకర్ వెంకటేష్, చంద్రశేఖర్ బృందాన్ని అభినందించారు. త్వరలో క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నామనీ, ప్రేక్షకులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాధ్, డైరెక్టర్లు, విష్షుమోహన్, కె.ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *