వృద్ది లక్ష్యాలను చేరుకోవాలి

టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు

ఈ ఏడాది తొలి 6నెలల వృద్ధిరేట్లు ప్రకటించాం. లోటు వర్షపాతంలో కూడా వృద్ధిరేటు తగ్గకుండా చూశాం. వ్యవసాయం, అనుబంధ రంగాల లక్ష్యం 22.14%కాగా 17.18% సాధించాం. జాతీయ వృద్ధిరేటు కన్నా 4రెట్లు ముందున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం అయన  నీరు-ప్రగతి,వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిఎస్ డిపిలో ఏపి అప్పుల వాటాను 10% తగ్గించగలిగాం.  నాలుగేళ్లలో రైతుల ఆదాయాలను రెట్టింపు చేశాం. ఉద్యానరంగ వృద్ది లక్ష్యం 20.24%కు 15.93% సాధించాం.  పశు సంవర్ధకం లక్ష్యం 19.87కు 15.34సాధించాం. ఆక్వా వృద్ధి లక్ష్యం 26.60%కాగా 22.36 సాధించామని అన్నారు. వ్యవసాయం,అనుబంధ రంగాల్లో వృద్ధి 22% సాధించాలి. ఏ రంగంలో మరింత వృద్దికి అవకాశం ఉందో గుర్తించాలి.అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి.  ప్రకాశం జిల్లాలో ఆక్వా అభివృద్దిపై ప్రత్యేక శ్రద్దపెట్టాలి.  గోకులం,మినీ గోకులాలకు భారీగా డిమాండ్ ఉంది. ప్రతిఏటా 15% సగటు వృద్ధి సాధించాలని సూచించారు. ప్రతిఏటా రాష్ట్ర ఆదాయం పెరగాలి. అన్నివర్గాల ప్రజలకు మంచి జరగాలి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవాలి. అధికార యంత్రాంగం వీటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలి. గోదావరి-పెన్నా అనుసంధానం పూర్తయితే నీటి సమస్య అనేదే ఉండదు. నదుల అనుసందానం,నీరు-ప్రగతితో సత్ఫలితాలు సాధించాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుండాలి. ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదు రూ.10వేల కోట్ల నరేగా నిధులు వినియోగించుకోవాలని అన్నారు. ప్రహరీగోడలు,సోక్ పిట్స్ పనులు వేగవంతం చేయాలి. కరవు ప్రాంతాల్లో ఉపాధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.  150రోజుల పనిదినాల లక్ష్యం చేరుకోవాలి. జనవరికల్లా ‘స్వచ్ఛ సంక్రాంతి’గా అన్ని  గ్రామాలను తీర్చిదిద్దాలి. గ్రామాల్లో ఎక్కడా చెత్తాచెదారం కనిపించరాదు. వీధి దీపాలన్నీ ఎల్ ఈడిగా మార్చాలి. ఉబరైజేషన్ ఏర్పాట్లు శరవేగంగా పూర్తిచేయాలి.  గ్రామగ్రామానా పచ్చదనం పెంపొందించాలి.  ఇంకా ఖచ్చితంగా నెల రోజులు సమయం ఉంది. ఈ 30రోజుల్లో అన్నిగ్రామాల్లో పరిశుభ్రత నెలకొనాలి.  స్వచ్ఛతకు, పరిశుభ్రతకు నెలవుగా మన రాష్ట్రం మారాలని అయన అన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *