కోడిగుడ్ల ఫ్యాక్టరీలో మంటలు

తగులబడ్డ గోడౌన్
మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
అసాంఘిక శక్తుల పనేనా…!?

తగులబడుతున్న ఫ్యాక్టరీ గోడౌన్

ఒంగోలులో కొత్తపట్నం బస్టాండు నుంచి కమ్మపాలెం మీదుగా దసరాజుపల్లి వెళ్ళేరోడ్డులో ఉన్న కోడిగుడ్ల అట్టల ఫ్యాక్టరీ తగులబడింది. కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ గోడౌన్ పూర్తిగా తగులబడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. అగ్ని మాపక సిబ్బంది మంటలు వ్యాప్తి కాకుండా అదుపులోకి తీసుకొచ్చారు. శ్మశానానికి సమీపంలో అప్పాయగుంట వద్ద ఈ ఫ్యాక్టరీ ఉంది. ఆ ప్రాంతం ఎంతో కాలంగా అసాంఘిక శక్తులకు అడ్డా గా మారినట్టు స్థానికులు చెబుతున్నారు. గంజాయి తాగే వాళ్ళు, మద్యం బాబులు ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారనీ, రాత్రి వేళల్లో ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించటం ఇబ్బందిగా ఉంటుందని కూడా చెబుతున్నారు. నిరుయోగంగా ఉన్న ఈ ఫ్యాక్టరీని కూడా అసాంఘిక శక్తులే తగులబెట్టి ఉంటాయని భావిస్తున్నారు. ప్రమాదం ఎలా చోటుచేసుకుందీ అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

https://vimeo.com/30548553400:26

https://vimeo.com/30548553400:26

https://vimeo.com/manage/305485534/general

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *