వ్యతిరేక శక్తుల ప్రయోజనమే జగన్ కు ముఖ్యం

మంత్రి ఆనందబాబు విమర్శ

వైఎస్ జగన్‌కు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదని, అందుకే రాష్ట్ర వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారని మంత్రి ఆనందబాబు విమర్శించారు. తెలంగాణలో తెరాస గెలిస్తే ఇక్కడ జనసేన, వైకాపా సంబరాలు చేసుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. తెలంగాణలో బినామీ ఆస్తులను సంరక్షించుకోవడానికే జగన్.. కేసీఆర్‌తో సంబంధాలు నెరుపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే.. ఆంధ్రా రాజకీయాల్లోకి నేరుగా అడుగుపెట్టాలని ఏపీ మంత్రి ఆనందబాబు సవాల్‌ విసిరారు. ఆంధ్రలోకి వస్తామని మాటలు చెప్పడం కాకుండా.. ధైర్యంగా రావాలని అన్నారు. వైకాపా, జనసేనలతో తెలంగాణలో చేసిన తెరచాటు రాజకీయాలు కాకుండా బహిరంగంగా కలిసి రావాలని అన్నారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన గురువారం మాట్లాడారు.తెరాస కారుకు.. భాజపా, వైకాపా, జనసేన, ఎంఐఎం అనేవి నాలుగు చక్రాలుగా మారాయన్నారు. కాగాతెలంగాణలో తెరాస గెలిస్తే.. వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంబరాలు చేసుకోవడం విచిత్రంగా ఉందని తెదేపా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని చెప్పిన తెరాస గెలిస్తే సంబరాలేంటని ప్రశ్నించారు రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్ర అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో అభివృద్ధి లేదని, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో భాజపా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తామని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని గోరంట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *