బంగాళాఖాతంలో అల్పపీడనం

రానున్న మూడురోజుల్లో ఉరుములతో వర్షాలు

రానున్న మూడు, నాలుగు రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తరువాత బలపడే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశాలున్నాయి. కాగా మధ్య మహారాష్ట్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, తమిళనాడు పరిసరాల్లో దట్టమైన మేఘాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *