జి.ఎస్.టి కాదు..గబ్బర్ సింగ్ యాక్ట్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)పై కాంగ్రెస్ ఎదురుదాడి కొనసాగుతోంది.గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారంనాడు గాంధీనగర్‌లో జరిగిన ‘నవ్‌సర్జన్ జనాదేశ్ మహాసమ్మేళన్’‌లో రాహుల్ గాంధీ జీఎస్‌టీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.జీఎస్‌టీని ‘గబ్బర్ సింగ్ యాక్ట్’గా అభివర్ణించారు.జీఎస్‌టీని అమలు చేయాలని కాంగ్రెస్ కోరుకున్నప్పటికీ మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ‘గబ్బర్ సింగ్ యాక్ట్’ను ప్రజలపై బలవంతంగా రుద్దిందని ఆరోపించారు.తన వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే మోదీ గత ఏడాది పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి లక్షలాది మంది ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశారని, ఇది చాలదన్నట్టు ఆ వెంటనే హడావిడిగా జీఎస్‌టీని అమల్లోకి తీసుకువచ్చారని తప్పుపట్టారు.’కాంగ్రెస్ తీసుకువచ్చిన జీఎస్‌టీలో 18 శాతం సీలింగ్ ఉంది.ప్రస్తుతం మోదీ సర్కార్ తీసుకువచ్చినట్టుగా 5 శ్లాబ్‌లు లేవు.ఆచితూచి ముందుకు వెళ్లాలని తాము చెప్పినట్టికీ ప్రభుత్వం పెడచెవిని పెట్టింది’ అని రాహుల్ తప్పుపట్టారు. చైనా తయారీ ఉత్పత్తుల వాడకం నిలిపివేయాలనే పిలుపునివ్వడానికి బదులు చైనాతో సంబంధాలు బలపడ్డాయని మోదీ ఘనంగా చెప్పుకుంటున్నారని, ప్రెస్ కెమెరాల దగ్గర నుంచి మంచి వాడుతున్న సెల్‌ఫోన్ల వరకూ ‘మేక్ ఇన్ చైనా’ ట్యాగ్ ఉంటోందని, ఒక సెల్ఫీ తీసుకునే సమయంలో చైనాలో ఒకరికి ఉద్యోగం వస్తోందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *