ఇండోనేషియా చేరుకున్న సుకన్య

భారత్‌ యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుకన్య ఇండోనేషియా చేరుకుంది. కమాండర్‌ ధియోధర్‌ నేతృత్వంలో బెలావన్‌పోర్టుకు చేరుకున్న సిబ్బందికి సంప్రదాయ స్వాగతం లభించింది. సమన్వయ గస్తీ కార్పొట్‌ 30వ ఎడిషన్‌లో పాల్గొనేందుకు నౌక ఇండోనేషియా  వెళ్లింది.భారత్‌-ఇండోనేషియాల మధ్య పరస్పర సహకారం, సమన్వయాల్లో భాగంగాఏర్పాటు చేసిన విన్యాసాల్లో ఐఎన్‌ఎస్‌ సుకన్య పాల్గొంటుంది.

ఇండోనేషియా కళాకారులతో భారత నావికా అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *