ఆకలి లేని శాంతియుత ప్రపంచం కావాలి..వెంకయ్యనాయుడు

భారత్‌ సహా అన్ని దేశాల్లోనూ వ్యాపార, వాణిజ్యాలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఏళ్లుగా చక్కగా తీర్చిదిద్దుతూ వచ్చారు. అయితే మనం త్వరితగతిన మారుతున్న ప్రపంచంలో జీవిస్తున్నాం. పని ప్రపంచం సైతం మారుతూ వస్తోంది. అందరం ఆకలికి తావులేని, శాంతియుత, సంతోషభరితమైన ప్రపంచాన్ని ఆవిష్కరించే దిశగా కృషి చేయడం తక్షణావసరం’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం జరిగిన ఎంటర్‌ప్రెన్యుర్స్‌ ఆర్గనైజేషన్స్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న నవభారతాన్ని ఆవిష్కరించేలా కొత్త సంస్కరణలు చేపట్టారన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *