సినారె విశ్లేషణాత్మక గ్రంధం ఆవిష్కరణ

తెలుగు సాహితీ శిఖరం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి.నారాయణరెడ్డి అని శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. నాగార్జున యూనివర్శిటీ పి.జి సెంటర్ లోని చరిత్ర ఉపన్యాసకుడు డాక్టర్ డి.వెంకటేశ్వరరెడ్డి రచించిన సి.నారాయణరెడ్డి సాహిత్య విశ్లేషణాత్మక గ్రంధాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాగుంట కుటుంబంతో సినారెకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన

గ్రంధావిస్కరణ సభకు హాజరయిన సాహితీ ప్రియులు

రాజ్యసభ సభ్యునిగా ఉన్నపుడు ఆయన నిధులను సాహిత్య వికాసానికి కేటాయించారని అన్నారు. సినారె సాహిత్యాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించిన ప్రొఫెసర్ వెంకటేశ్వరరెడ్డిని మాగుంట అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన పిజి సెంటర్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.సోమశేఖర్ మాట్లాడుతూ తెలుగు భాషపై పట్టు సాధించాలంటే శతక సాహిత్యాన్ని చదవాలన్నారు. ఆత్మీయ అతిథి, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి.హనుమారెడ్డి మాట్లాడుతూ 18 సంపుటాలతో సినారె సాహితీ సర్వస్వం ముద్రిస్తే 3,4 సంపుటాలను తమ సంఘం మాగుంట సహకారంతో ముద్రించిందన్నారు. మరణాన్ని ముందే ఊహించిన సినారె ‘మరణంతో రణం’, కలం అలిగింది కావ్యాలను రచించారని అన్నారు. సినారె సాహిత్య గ్రంధాన్ని ప్రరసం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, పద్యకవి ఉన్నం జ్యోతివాసు, ఎం.శ్రీనివాసులరెడ్డి సమీక్షించారు. అనంతరం నాగార్జున యూనివర్శిటీ పిజి సెంటర్ తరపున మాగుంటనూ, రచయిత వెంకటేశ్వరరెడ్డిన సత్కరించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *