14 నుంచి బెలూన్ ఫెస్టివల్

  • ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అరకులోయలో ఈ నెల 14 నుంచి మూడురోజుల పాటు బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహిసున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ, రోజూ ఉదయం, సాయంత్రం 13 దేశాలకు చెందిన 16 మంది పైలట్లు బెలూన్లు ఎగురవేస్తారని చెప్పారు. సముద్రమట్టం నుంచి సుమారు 5 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే వీటి బాస్కెట్‌లో నలుగురు నుంచి 8 మంది వరకు ఎక్కవచ్చని చెప్పారు. దీనికోసం 6,200 మంది పేర్లు నమోదు చేసుకోగా, లాటరీ ద్వారా కొం దర్ని ఎంపిక చేస్తామని వివరించారు. వచ్చేనెల 9, 10 తేదీల్లో విశాఖలో స్ర్పింజ్‌ ఉత్సవాలు జరుపుతామని మంత్రి చెప్పారు. విశాఖ ఉత్సవ్‌ను వచ్చేనెల 22 నుంచి మూడు రోజులు నిర్వహిస్తామన్నారు. జనవరిలో కుకింగ్‌ ఒలింపియాడ్‌, ఫిబ్రవరి 10నుంచి 14వరకు యాచింగ్‌ (పడవలు) ఫెస్టివల్‌ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *