టెక్‌, ఈ కామర్స్‌ సంస్థల్లో భారీగా ఉద్యోగాలు

2019లో రానున్న 40 వేల ఉద్యోగాలు

ముంబాయి : 2019లో టెక్నాలజీ నిరుద్యోగులకు ఉద్యోగాలకోసం  టెక్‌ అంకురాలు, ఈ కామర్స్‌ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగాలకోసం రంగ సిద్ధం సిద్దం చేస్తున్నాయి. హెల్తియన్స్‌, మిల్క్‌ బాస్కెట్‌, కార్స్‌ 24, ఇస్టామోజో, మో ఎంగేజ్‌ వంటి సంస్థలు ఇప్పటితో పోలిస్తే 50 శాతం ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వనున్నాయట. మార్కెట్లలో చొచ్చుకు పోవాలని ప్రయత్నిస్తున్న జొమాటో, ఓయో, స్విగ్గీ వంటి సంస్థలు తమ ఉద్యోగులను 30 శాతం పెంచుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయని విశ్లేషకులు అంటున్నారు.‘క్రృతిమ మేధస్సు, బిగ్‌డేటా అనలిటిక్స్‌ ఉద్యోగ వాతావరణాన్ని పూర్తిగా మార్చనున్నాయి. ఎక్కువ ఉద్యోగాలను సృష్టించనున్నాయి’ అని నాస్కామ్‌ ఉపాధ్యక్షుడు కేఎస్‌ విశ్వనాథన్‌ అన్నారు. 2019లో టెక్‌ సంస్థలు 40,000 అదనపు ఉద్యోగాలు ఇవ్వనున్నాయని ఆయన తెలిపారు. 2015తో పోలిస్తే టెక్‌ సంస్థలు రెట్టింపయ్యాయి. 2018లో ఉద్యోగ కల్పనలో 55 శాతం వృద్ధి నమోదు చేశాయి. పెరుగుతున్న అవసరాల రీత్యా ప్రస్తుతం చాలా సంస్థలు సొంత టెక్నాలజీ బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆహార సరఫరా, ఈ కామర్స్‌ వంటి సంస్థలు ముందున్నాయి.జొమాటోలో యాంట్‌ ఫైనాన్షియల్‌ 210 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. నాస్పర్స్‌ నుంచి స్విగ్గీ 100 కోట్ల డాలర్లు పెట్టుబడులు పొందింది. ఇవన్నీ చిన్న పట్టణాల్లోనూ సేవలు విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. ఓయో రూమ్స్‌ సైతం తమ టెక్నాలజీ విభాగాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాకు చెందిన మేఫీల్డ్‌ ఫండ్‌ నుంచి గుడ్‌గావ్‌కు చెందిన మిల్క్‌బాస్కెట్‌ 7 మిలియన్‌ డాలర్ల అదనపు పెట్టుబడులు దక్కించుకుంది. 2019లో తమ ఉద్యోగులను సంఖ్యను 3 వేలకు పెంచుకోనుంది. ఇంటి వద్దే వైద్యసేవలు అందించే హెల్తియన్స్‌ 2019లో 150 మందిని నియమించుకోనుంది. కార్స్‌24 సంస్థ కొత్త ఏడాదిలో తమ ఉద్యోగుల సంఖ్యను 3 వేలకు పెంచుకోనుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *