ముఖ్యమంత్రి పరామర్శ

ఫెర్రీ ప్రమాద ఘటనా స్థలాన్నిరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిశీలించారు. కుటుంబసభ్యులనూ, ఆప్తులను పోగొట్టుకున్న వారిని ఓదార్చారు.  ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు.గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. ఆంధ్రా ఆసుపత్రిలో ప్రస్తుతం నలుగురు చికిత్స పొందుతున్నారనీ, ఇద్దరిని డిశ్చార్జి చేశామని మంత్రి కామినేని ముఖ్యమంత్రికి తెలిపారు.

బోటు ఎప్పుడు బయలుదేరింది, ఎంతమంది ఉన్నారు: అఖిలప్రియ ఆరా

విజయవాడ: కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు.ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కార్తీక వన సమారాధనకు వచ్చిన పర్యాటకులకు ఇలాంటి ప్రమాదం ఎదురవడం, మృతుల్లో ఎక్కువమంది ఒంగోలు వాకర్స్ క్లబ్‌కు చెందిన వారు కావడంపై మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. బోటు భవానీ ద్వీపం నుంచి ఎప్పుడు బయలుదేరింది, ఆ సమయంలో పరిమితికి మించి ఎంత మందిని ఎక్కించుకున్నారు? అనే అంశాలను ఆరా తీశారు.
బోటు నిర్వాహకులైన సింపుల్ వాటర్ స్పోర్ట్స్ సంస్థ, రివర్ బోటింగ్‌కు అసలు అనుమతులు ఉన్నాయా? అనే అంశంపై లోతుగా పరిశీలన జరపాలని టూరిజం అధికారులను ఆదేశించారు.

courtesey telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *