అభివృద్ధి కొనసాగాలంటే ‘బాబు’ మళ్ళీ రావాలి

సంక్షేమం, సుస్థిర అభివృద్ధి కొనసాగాలంటే చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. కొండెపి నియోజకవర్గం టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే డోలా బాల వీరంజనేయ స్వామి, దామచర్ల సత్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ రాష్ట్రంలో 2.5 కోట్ల మందికి చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని అన్నారు. వ్యవసాయంలో 11 శాతం వృద్ధి సాధించామనీ, 54 లక్షల సామాజిక పింఛన్లు, 1.46 కోట్ల రేషన్ కార్డులు ఇచ్చామనీ, 24 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణ మాఫీ చేసినట్టు తెలిపారు. ఈ సంద్భంగా దామచర్ల సత్య, వీరాంజనేయస్వామితో కలిసి సంక్రాంతి కానుకలు,ఎన్టీఆర్ గృహాల మంజూరు పత్రాలు,39 మంది లబ్దిదారులకు రూ.14 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు, రేషన్ కార్డ్స్,చంద్రన్న పసుపు కుంకుమ పధకం క్రింద రూ.10.000 వంతున రెండు గ్రూప్ లకు రూ.20,000 లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 మార్కండేయులు గారు,నియోజకవర్గ జన్మభూమి ప్రత్యేక అధికారి,మత్స్య శాఖ అధికారి బలరాం గారు,ఎమ్.పి.పి.చంద్రశేఖర్, జడ్పీటీసీ కొటేశ్వరమ్మ, తసీల్దార్ రాజ్ కుమార్,ఎమ్.పి.డి. ఓ.ప్రభాకర్, బెజవాడ వెంకటేశ్వర్లు,శైలజ, టీడీపీ నాయకులు,ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

దామచర్ల సత్యతో మాటా మంతీ

 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *