అన్నపూర్ణా స్టూడియోలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2లోని అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ‘మనం’ సినిమాకు సంబంధించిన సెట్టింగ్‌కు నిప్పుంటుకోవడంతో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు పెద్దఎత్తున ఎగసిపడడంతో ఫిలింనగర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. విద్యుత్‌ షాక్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి మీడియాను గానీ, మరెవరినీ ఆనుమతించ లేదు. ప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్టింగ్‌ దగ్ధమైంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *