పోలవరం ఓ వరం : శిద్దా

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా సాగు, తాగునీటి ఇబ్బందులే తలెత్తవని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట 22వ వార్డులో నిర్వహించిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో ఆయన మంత్రి పత్తిపాటి పుల్లారావుతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో 24 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసిన ముఖ్యమంత్రిదేనని శిద్దా అన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద యువతకు నెలకు రూ. 1000 నిరుద్యోగ భృతి అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సివిల్స్ కోచింగ్, విదేశీ విద్యకు రూ 15 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చిలకలూరిపేటలో గృహ ప్రవేశాలకు 5 వేల ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల నాటికి పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *