రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన

నేడు జిల్లాక ు రానున్న ముఖ్యమంత్రి

నెరవేరనున్న జిల్లా ప్రజల చిరకాల స్వప్నం
అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడి

జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 9న బుధవారం శంఖుస్థాపన చేయనున్నారని రాష్ట్ర రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఒంగోలులో మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో విరివిగా లభించే గ్రానైట్,మినరల్స్, జీడిపప్పు,పొగాకు తదితర వాణిజ్య పంటలు,ముడి సరుకు ఎగుమతులకు పోర్టు ఉపయోగ పడుతుందని మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లాకే కాకుండా పొరుగు జిల్లాలకు కూడా పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం 2 లక్షల మెట్రిక్ టన్నుల షిప్పింగ్ సామర్ధ్యం,10 బెర్త్ లు,డాక్ యార్డ్ నిర్మాణం, రామాయపట్నం పోర్ట్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రైట్స్ సంస్థ నివేదిక అందించిందనీ, నాన్ మేజర్ పోర్ట్ కోసం సుమారు 4,652 ఎకరాలలో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో రామాయపట్నం పోర్టు నిర్మిస్తుందన్నారు. 2019 డిసెంబర్ నాటికి టెండర్ ప్రక్రియపూర్తి చేసి 2020 నుంచి పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. దీని వల్ల సుమారు 15 వేల మంది ఉపాధి కలుగుతుందన్నారు. రామాయపట్నం పోర్ట్ శంఖుస్థాపనతో పాటు 3 కిలోమీటర్లు దూరంగా చేవూరు గ్రామంలో ఆసియా పేపర్ అండ్ పల్ప్ పరిశ్రమ స్థాపనకు పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. తొలిదశలో రూ.27 వేల కోట్లతో ఏడాదికి 5 మిలియన్ టన్నుల పేపర్ తయారీ సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటవుతుందని తెలిపారు. సుమారు 2,450 ఎకరాలలో పరిశ్రమ స్థాపన, 18 వేల మందికి ప్రత్యక్ష,పరోక్షంగా ఉపాధి కల్పన కలుగుతుందన్నారు. 120 దేశాలకు పేపర్ ఎగుమతులు చేస్తున్న అతి పెద్దభారీ పరిశ్రమ మన జిల్లాలో తమ పరిశ్రమ స్థాపనకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *