పోర్టు, పేపర్ మిల్లుతో ప్రకాశానికి మహర్దశ

రామాయపట్నం పోర్టు
ఆసియా పేపర్ పల్ప్ పరిశ్రమలకు శంఖుస్థాపన
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా
సొంతంగా పోర్టు నిర్మిస్తున్నాం
అవగాహన లేకుండా పోర్టుపై విమర్శలు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

పేపర్ మిల్లు యాజమన్యాంతో ఎంవోయు కుదుర్చుకుంటున్న దృశ్యం, పక్కన అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తదితరులు

రామాయపట్నం ఓడరేవు నిర్మాణం వల్ల ప్రకాజిల్లా వేగవంతం గా అభివృద్ధి చెందుతుoదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కందుకూరు నియోజకవర్గ పరిధిలోని ఉలవపాడు మండలం లో బుధవారం రామాయపట్నం లో పోర్టుకు శంఖుస్థాపన చేసిన జన్మ భూమి-మాఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామాయపట్నం పోర్టుకు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే 5 వేల కోట్ల రూపాయల తో 3 వేల ఎకరాల్లో రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి సంకల్పించిందని తెలిపారు. దీంతో ప్రకాశం వాసుల కల నెరవేరుతుందన్నారు. రామాయపట్నంలో మత్స్యకారుల కోసం ఒకటి, వాణిజ్యకార్యకలాపాల కోసం మరొక పోర్టు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొంతమంది రాజకీయనాయకులు అవగాహనా రాహిత్యంలో రామాయపట్నం మైనర్ పోర్టుపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన విశాఖపట్నం పోర్టు కంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కృష్ణ పట్నం పోర్ట్ ను అద్భుతంగా నిర్మించిన విషయాన్ని గుర్తెరగాలన్నారు. కాకినాడ, మచిలీపట్నంలల్లో కొత్తగా పోర్టులు ఏర్పాటు చేయడానికి శంఖుస్థాపన చేశామనీ,. భావన పాడు పోర్ట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. రామాయపట్నం లో పోర్టు నిర్మాణానికి కృష్ణపట్నం పోర్ట్ కు ఉన్న ప్రత్యేక హక్కులు అడ్డంకులుగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని ఒప్పించి రామాయపట్నం ఓడరేవుకు ఉప్రకమించామని గుర్తు చేశారు. 20 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ప్రారంభమవుతున్న రామాయపట్నం పోర్టును 40 మిలియన్ మిలియన్ టన్నుల సామర్ధ్యానికి పెంచుతామన్నారు.

ముఖ్యమంత్రి సంకురాత్రి సంబరాలు

పేపర్ మిల్లుకు శంఖుస్థాపన

రామాయపట్నం పోర్టుతో పాటు పేపర్ మిల్లుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా పేపర్ పల్ప్ కంపెనీ 25 వేల కోట్ల రూపాయలతో పేపర్ మిల్లు నిర్మించేందుకు ముందుకు వచ్చిందన్నారు. దీని వల్ల 50 వేల మంది రైతులకు ఉపయోగం ఉంటుందన్నారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న జామాయి ల్,సూబాబుల్ సమస్యలను పరిష్కరించడాని చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర విభజన తరువాత22 మిలియన్ ల విద్యుత్ కొరత ఉందన్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి, ప్రకాశము జిల్లాలో దొనకొండ లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ను వేగవంతం గా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు శాసన మండలి సభ్యులు కరణము బలరాం కృష్ణ మూర్తి,పోతుల సునీత, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఒంగోలు ఎమ్మెల్యే దామాచర్ల జనార్ధన్ రావు,అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే డి.వి.బి.స్వామి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి,కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు,రాష్ట్ర ఆటవి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దివి శివరాం,అసియా అసియా ఫుల్ప్ ,పేపర్ సంస్థ ప్రతినిధులు శ్రీసురేష కెల్లామ, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్,జాయింట్ కలెక్టర్ ఎస్..నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ నిశాంతి, స్టెప్ సీఈఓ బి.రవి,ఒంగోలు ఆర్.డి.ఓ కిషోర్, కందుకూరు ఆర్.డి.ఓ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

పసుపు కుంకుమ అందిస్తున్న చంద్రబాబునాయుడు
గురి చూస్తున్న చంద్రబాబు
హెలిపాడ్ వద్ద స్వాగతం పలుకుతున్న అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *